Followers

కరోనా వైరస్ నియంత్రణపై సమీక్ష

 కరోనా వైరస్ నియంత్రణపై సమీక్ష


మందమర్రి, పెన్ పవర్ 

కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా మంగళవారం డైరెక్టర్ ఆపరేషన్ పా చంద్రశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ లో జీఎం చింతల శ్రీనివాస్ తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఏరియాలో ఎంతమంది వ్యాక్సిన్ వేసుకున్నారని, గనులపై వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యల పై అడిగి తెలుసుకున్నారు. వైరస్ నియంత్రణకు గనులపై తీసుకోవలసిన జాగ్రత్తలు పట్ల సూచనలు చేశారు. ఉద్యోగులు భౌతిక దూరం పాటించేలా చూడాలని, కార్మికులకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని, మాస్కులు ధరించే లా చూడాలని, ఎవరికైనా వైరస్ సోకినట్లు అయితే వైద్య సిబ్బంది తగు చికిత్స చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం శ్రీ రామ్ మోహన్, కేకే ఓసి. ఆర్కే ఓసి. అధికారులు పద్మ నాభ రెడ్డి, మధుసూధన్, డివైపిఎంఓలు డా. ఉషా, డా.మహిపాల్, పీఎం వరప్రసాద్, ఆరోగ్య అధికారి లోక నాథ్ రెడ్డి సివిల్ ఈఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...