గంబీర్ ఠాక్రె ను పరామర్శించిన రంగినేని మనీషా- పవన్ రావు
బేలా (ఆదిలాబాద్ ),పెన్ పవర్
టిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, బేలా ఎంపీపీ వనిత ఠాక్రె భర్త గంభీర్ ఠాక్రె గత రెండు రోజుల క్రితం జైనథ్ మండలం లోని బెల్గమ దగ్గర అదుపుతప్పి కింద పడడంతో చిన్న గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా- పవన్ రావు మంగళవారం మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగు క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వాడ్కర్ తేజ రావు, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు క్యాతం రాఘవులు, టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహమ్మద్, తెరాస నాయకులు గంగారెడ్డి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment