రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది
*ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
* జైనథ్ మార్కెట్ యార్డ్ లో శనగా కొనుగోళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
* పార్టీలో భారీ సంఖ్యలో చేరారు బిజెపి కాంగ్రెస్ నేతలు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్తర సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ ల నాయకులూ టీ.ఆర్.ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి శనగ కొనుగోళ్లను ప్రారంభించారు. అనంతరం ఆదిలాబాద్ గ్రామీణ మండలం న్యూ రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ లకు చెందిన నేతలు టీ.ఆర్.ఎస్ పార్టీ లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబి కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, ఇతర పార్టీ ల నేతలు కొట్నాక్ జంగు, దుర్శెట్టి కృష్ణ, నరేందర్ రెడ్డి, రాజు, అశోక్ తదితరులు పార్టీ లో చేరగా ఎమ్మెల్యే రామన్న వారికి గులాబి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం అవి సుప్రీమ్ కోర్ట్ చొరవతో స్టే లో ఉన్నాయని పేర్కొన్నారు. పంట కొనుగోలులో ఇరవై శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం నిబంధనలు పెట్టిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారని, అందుకు అనుగుణంగానే శనగ కొనుగోళ్లను ప్రారంభించినట్లు వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం ఇప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అక్కడి ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజా రెడ్డి, ఆత్మ చైర్మన్ జిట్ట రమేష్ గారు, ఎం.పీ.పీ సెవ్వ లక్ష్మి జగదీష్, టి.ఆర్.ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రురల్ కొడప సోనేరావ్, టీ.ఆర్.ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి ఆరే నరేష్, మాజీ జెడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ గారు, సర్పంచులు ఎం.పి.టి.సీలు నాయకులు ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment