బడ్జెట్ పాఠశాలల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే..
స్పందించిన మంత్రి..త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ..
జీడిమెట్ల, పెన్ పవర్తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి సభ ద్వారా పలు విషయాలను ప్రస్తావించారు.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 వేల ప్రైవేట్ పాఠశాలలు ఉంటే అందులో 10వేల వరకు బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయని, జిహెచ్ఎంసి పరిధిలోనే 5,750 బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ పాఠశాలల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, ఒక లక్ష నలభై మూడు వేళ మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారని పేర్కొన్నారు.. ఈ బడ్జెట్ పాఠశాలలను ఇంటర్నేషల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ ను ఫీజుల వారీగా క్యాటగిరైజేషన్ చేయని మూలాన కార్పొరేటర్ పాఠశాలలకు వేసే టాక్స్ ను బడ్జెట్ పాఠశాలలకు వేయడంతో వీరు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలలు అన్ని పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉన్నాయని, సుమారు 300 బడ్జెట్ పాఠశాలలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయని వివరించారు.. ఈ సమస్యల పరిష్కారానికి క్యాటగిరైజేషన్ వెంటనే అమలు చేయాలని, ఆస్తిపన్నుపై సమీక్షించి, వాణిజ్యేతర విధానాన్ని ప్రవేశపెట్టాలని ఉపసభాపతి ద్వారా సంబంధిత మంత్రిని కోరారు. అలాగే విద్యుత్, నీటిని కమర్షియల్ నుండి డొమెస్టిక్ గా మార్చాలని, కరోనా లాక్ డౌన్ వల్ల సుమారు 10 నెలలు పాఠశాలలు అన్నీ పూర్తిగా మూసివేయడం కారణంగా టాక్స్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయని, ఈ సంవత్సరానికి జిహెచ్ఎంసి పరిధిలోని పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉన్న బడ్జెట్ పాఠశాలలకు టాక్స్ ను రద్దు చేయాలని మంత్రిని కోరారు. బడ్జెట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కరోనా పరిస్థితుల దృష్ట్యా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని వారికి ప్రభుత్వం ఆదుకొని రూ.6 వేలు నిరుద్యోగ బృతి కింద విద్యాశాఖ ద్వారా అందించాలని కోరారు. క్యాటగరైజేషన్ చేయని మూలాన ఆర్థిక భారం అంతా పిల్లల తల్లిదండ్రుల మీద పడుతుందని, వారికి ఉపశమనం కలిగే విధంగా చూడాలని కోరగా సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ... ఎమ్మెల్యే కేపి వివేకానంద్ లేవనెత్తిన అంశాలు విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖలకు సంబంధించిన అంశాలు కాబట్టి తప్పకుండా పరిశీలించి ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు.
No comments:
Post a Comment