ఆడబిడ్డలకు అండగా కేసీఆర్
గుడిహత్నూర్,పెన్ పవర్
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అడబిడ్డలకు అండగా ఉంటుందని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని బోథ్ ఎమ్యెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో 36 మంది కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రు.36.4176 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గతంలో పేద ప్రజలు ఆడపిల్లల పెండ్లిళ్లు చేయాలంటే భయపడేవారని, నేడు ఆ పరిస్థితి లేదని పిల్లల పెండ్లిళ్లలకు కేసీఆర్ పెద్దన్న వలే ఆదుకుంటున్నారన్నారు.ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పవన చంద్ర, ఎంపీపీ,సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment