Followers

సేవారత్న నేషనల్ అవార్డు అందుకున్న పంజా సమ్మయ్య యాదవ్

 సేవారత్న నేషనల్ అవార్డు అందుకున్న పంజా సమ్మయ్య యాదవ్




మందమర్రి,  పెన్ పవర్

2021 సంవత్సరపు సేవారత్న నేషనల్ అవార్డును పరిణయం మ్యారేజ్ బ్యూరో పంజా సమ్మయ్య యాదవ్ మార్చి 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డా, యు సుబ్రమానియన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకురావడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా  ఉద్యమ కారులకు, సంఘ సేవకులకు, కవులకు, రచయితలకు అవార్డులను అందజేస్తున్నట్లు తెలియజేశారు. సౌత్ ఇండియా లోని 6 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదిచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 600 మంది  డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారని తెలిపారు. అవార్డు గ్రహీత పంజా సమ్మయ్య యాదవ్ మాట్లాడుతూ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ అవార్డును అందజేసిన బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీ జి విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు మల్లగల్ల మల్లేష్, సామ్రాట్ గోవర్ధన్, తాటికంటి ఐలయ్య, ఆరేల్లి లక్ష్మీరాజం, కనుకుంట్ల విజయ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...