Followers

విశాఖ ఉక్కు రక్షణ ఆంధ్రుల హక్కు

 విశాఖ ఉక్కు రక్షణ ఆంధ్రుల హక్కు



వి. ఆర్. పురం. పెన్ పవర్

 విశాఖ ఉక్కు రక్షణ ఆంధ్రుల హక్కుఅనివిశాఖ ఉక్కు పరి రక్షణ పోరాట వేదిక ఇచ్చిన రాష్ట్ర బంద్ లో భాగంగా ఈ నెల 5 న జరిగే రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి-సి.ఐ.టి.యు, సి. పి. ఎం. మండల కమిటీ పిలుపు నిచ్చారు.     విశాఖ స్టీల్ ను ప్రయివేట్ పరం చేయాలని  మోడి ప్రభుత్వం బి.జె.పి చేస్తున్న కుట్రను ఆంధ్రులు అందరం కలిసి ప్రతిగటిద్దామని,కడప ఉక్కు ప్రభుత్వ రంగంలో నిర్మించాలని తదితర డిమాండ్ల సాధన కోసం  వి.ఆర్.పురం మండల సి.ఐ.టి.యు,సి.పి.యం సంపూర్ణ మద్దతు తెలుపుతూ బంద్ లో పాల్గొంటామని ఆయా నాయకులు బంద్ కు సంబందించిన  పోస్టర్లు మంగళ వారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సి.పి.యం సీనియర్ నాయకులు మాజీఎం. పి. పి కారం.శిరమయ్య,సి.పి.యం జిల్లా నాయకులు మండల కార్యదర్శి బొప్పెన.కిరణ్, సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు పూనెం.సత్యనారాయణ,సి.పి.యం నాయకులు సోయం.చినబాబు, పులిసంతోష్ కుమార్,తోడం.రాజు, గుండెపుడి.లక్ష్మణ్ రావు,పోడియం.శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...