గెలుపు,ఓటములు సహజము విస్తృతస్థాయి సమావేశంలో ... కొల్లి సింహాచలం
మహారాణి పేట, పెన్ పవర్
వైసిపి నాయకురాలు కొల్లి సింహాచలం అధ్యక్షతన ఆదివారం ఉదయం 39వ వార్డు,లక్ష్మి టాకీస్ జంక్షన్ లో వున్న ఆంగ్లో-ఇండియన్ కళ్యాణమండపంలో వార్డు వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా కొల్లి సింహాచలం మాట్లాడుతూ, జీవీఎంసీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినంత మాత్రాన్న ఎవరు అధైర్య పడవొద్దన్నారు. గెలుపు,ఓటములు సహజమన్నారు.
జగనన్న, సాయన్న సహకారంతో ప్రతి ఒక్కరూ పార్టీ మరింత పటిష్టత కు ఐక్యంగా కృషి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తని అధిష్టానం గుర్తుస్తోందని,అటువంటి వారికి నామినేటెడ్ పదవుల పందేరం లో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment