అధికారులు బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్..
మేడ్చల్,పెన్ పవర్
మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ పేర్కొన్నారు..
సోమవారం కీసర మండలం ఉప్పల్లోని మేకల భారతి గార్డెన్స్‌లో అదనపు పోలింగ్ అధికారులు (ఓపీవో)లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికలు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో 1,31,000 మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారని... అందుకు గాను 198 పోలింగ్ కేంద్రాలు. ఎన్నికలకు సంబంధించి రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని అదనపు కలెక్టర్ విద్యాసాగర్ తెలిపారు .అలాగే ఎన్నికల రోజున పోలింగ్ సెంటర్లు, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లు జరగకుండా ముందుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత శిక్షణ అధికారులను సలహాలు, సూచనలు అడిగి తెలుసుకొని జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని మరికొన్ని చోట్ల వీడియోగ్రఫీ తీయిస్తున్నట్లు అదనపు కలెక్టర్ విద్యాసాగర్ వివరించారు. పోలింగ్ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ముందుగా బ్యాలెట్ బాక్సులు పని చేస్తున్నాయా, అన్ని రకాల వస్తువులు ఉన్నాయా లేదా అనే విషయాలను చూసుకోవడంతో బ్యాలెట్ పేపర్లను సరి చూసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ అందచేసిన పుస్తకాన్ని చదవాలని అన్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణ సమయంలో తమ బాధ్యతను విస్మరించరాదని అదనపు కలెక్టర్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దేవసహాయం, ఆర్ డి ఓ ,మల్లయ్య , తహశీల్దార్ గౌతమ్ , అదనపు పోలింగ్ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment