Followers

భయం వీడి ముందుకు రండి

 భయం వీడి ముందుకు రండి

సంతబొమ్మాళి,పెన్ పవర్

సంతబొమ్మాళి మండలంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులు ప్రజలలో అవగాహన కల్పించడానికి అందరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలియజేస్తూ మండలంలో నౌపడ పీహెచ్సీ   వైద్యాధికారి సిహెచ్ కోదండ రావు ఆధ్వర్యంలో మంగళవారం వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ ను పాత్రికేయులకు వేసారు.అనంతరం గంట కాలం పాటు పర్యవేక్షణ లో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి దుష్పరిణామాలు లేదని తెలియజేశారు. ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు పాత్రికేయులు ముందుకు రావడం మంచి పరిణామం అని తెలియజేశారు. ప్రజలు అపోహలు వీడి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఆయన కోరారు. అంతకుముందు పాత్రికేయులకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఈ వో జి. కూర్మనాయకులు, హెచ్ ఎస్ రామ తిరుపతిరావు, హెచ్ వి సూర్య కళ, ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్, పాత్రికేయులు కర్రి శంకర్ రెడ్డి, పి చంద్రశేఖర్, రామారావు, నగేష్ శర్మ, పి. సంతోష్, సూరాడ జోగారావు, ఎస్.శివ, భాను ప్రకాష్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...