వైసిపి అభ్యర్ధులను గెలిపించండి
- 25, 26 వార్డులలో జమ్మీలు విస్తృత ప్రచారం
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీలో 25, 26 వార్డులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు విస్తృత ప్రచారం నిర్వహించారు. 25 వ వార్డు అభ్యర్థి దేవత అరుణ, 26 వార్డ్ అభ్యర్థి రుత్తల శ్రీనివాసరావు లకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గతంలో సన్యాసిపాత్రుడు దంపతులు ప్రాతినిధ్యం వహించిన వార్డులే కావడంతో అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని కోరారు. రాబోయే రోజులలో వార్డులను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ముఖ్యంగా 26 వ వార్డులో సన్యాసిపాత్రుడును సాదరంగా ఆహ్వానించారు. తప్పక మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రచారంలో చెరుకూరి సత్యనారాయణ, యువనాయకుడు చింతకాయల వరుణ్, లోకవరపు శారద, కర్రి రాంగోపాల్ , మీసాల సత్యనారాయణ, దాడి బుజ్జి , ఆరుగొల్లు రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment