అంగన్వాడి సెంటర్ లో పోషక పక్వాడ్
లక్షెట్టిపెట్, పెన్ పవర్
పట్టణంలోని అంగన్వాడి 8వ సెంటర్ లో పోషక పక్వాడ్ కార్యక్రమాన్ని శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ బాలింతలు,గర్భిణులు చిన్నారులు పోషక పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలన్నారు.ఆకు కూరలు,గుడ్లు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని అందులో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నారు,ముఖ్యంగా బాలికలు రక్తహీనత నుండి తట్టుకోవడానికి మంచి ఆహరం పాలు పండ్లు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లక్ష్మి,ఎఎన్ఎం సుజాత,ఆశా కార్యకర్తలు శారదా,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment