Followers

అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలి

 అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలి     


 పెన్ పవర్, కందుకూరు

 దేశ అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయాలని కందుకూరు భాజపా నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర మహిళా మోర్చా జోనల్ ఇన్చార్జి ఉన్నం నళినీ దేవి అన్నారు. ఎంపీ అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు సోమవారం తిరుపతిలో ప్రమాణం చేశారు. అనంతరం ఉన్నం నళినీ దేవి మాట్లాడుతూ ఏప్రిల్ 17న జరగనున్న పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రత్నప్రభ గెలుపు ఖాయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి రైల్వే పనులు అభివృద్ధి కోసం 87 కోట్లతో విడుదల చేసి పనులు చేపట్టారని తెలిపారు. కృష్ణపట్నం వెంకటాచలం మధ్య రైల్వే డబ్లింగ్ తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి చేశారని తిరుపతి ప్రాంత అభివృద్ధి కోసం బిజెపి ఎన్నో ప్రణాళికలు రూపొందించుకొని ఉన్నారని తెలిపారు. తిరుపతికి జాతీయస్థాయి గుర్తింపు సాధించాలంటే ఎంపీ బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి రత్నప్రభను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఎంపీ అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...