Followers

హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయని మున్సిపల్ అధికారులు

 హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయని  మున్సిపల్ అధికారులు; రాచాల గౌడ్

వనపర్తి, పెన్ పవర్


హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొత్తకోట మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం ముందు అక్రమ కట్టడాలతో ఇబ్బందులకు గురవుతున్న బాధితులతో కలిసి రాచాల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాచాల గౌడ్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన మ్యాదరి రాములు ఇంటికి అనుకుని కొందరు అక్రమ కట్టడం చేపట్టారని దీనిపై అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడతో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా అక్రమ కట్టడం ఆపాలని స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను  అమలు చేసి,అక్రమ నిర్మాణాన్ని ఆపాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కోర్టు ఆదేశాలు అమలు చేసి బాధితులకు అండగా ఉండాల్సిన అధికారులు  కబ్జాదారులకే సహకరిస్తూ వస్తున్నారని ఆరోపించారు.కొత్తకోట పట్టణంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నా  అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారని, అధికారుల నిర్లక్ష్యం, వారి అండదండలతోనే పనులు సాగుతున్నాయని ఆయన విమర్శించారు పట్టణంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మీడియా సమక్షంలోనే  పరిశీలించాలని రాచాల పట్టుబట్టడంతో కమిషనర్ శ్రీపాద అక్రమ కట్టడాన్ని పరిశీలించి,వెంటనే వాటిని తొలగించి  భాద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్,బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గౌడ్,కన్వీనర్ అరవిందాచారి,మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, దివాకర్, శివ, రామన్ గౌడ్, బాధితులు మ్యాదరి రాములు,అంజమ్మ, రాజు, అఖిల్  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...