ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం
చిన్నగూడూరు, పెన్ పవర్
స్థానిక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తుందని దానికి సీఎం కేసీఆర్ కారణమని తెలిపారు. ఇందులో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువజన నాయకులు డి ఎస్ రవి చంద్ర ఆదేశాల మేరకు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది అని అన్నారు. మండల తెరాస యూత్ అధ్యక్షులు దుండి మురళి, బాదావత్ సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, హై స్కూల్ కార్యాలయాలలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు గుదే నవీన్ ,గుదే ఉపేందర్, మండల యూత్ సభ్యులు శమ కురి మనోహర్, డానియల్, రవి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment