Followers

పరిగి న్యాయ వాదుల రిలే నిరాహారదీక్ష

 పరిగి న్యాయ వాదుల రిలే నిరాహారదీక్ష

 వికారాబాద్: జిల్లా, పెన్ పవర్


వికారాబాద్ జిల్లా పరిగి  తరఫున న్యాయవాదుల రక్షణ చట్టం సాధనకై రెండో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన న్యాయవాదులు. ఈ రిలే నిరాహార దీక్షకు వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలపడం తెలిపారు.

అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము యాదవ్ మాట్లాడుతూ వామన్ రావు దంపతులను అందరూ చూస్తుండగానే నరికి చంపడం చాలా దారుణం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరినారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల న్యాయవాలప్తె నమ్మకం పోతుందని రాములు యాదవ్ అన్నారు . లేదంటే మార్చి 9న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వస్తామని హెచ్చరించడం జరిగింది. సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగాలని న్యాయవాదుల దగ్గరకు వస్తారని అలాంటి న్యాయవాదుల కి అన్యాయం జరిగితే ఎలాగని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుటకు ఏవిధమైన పోరాటం చేసినమో ఈ రక్షణ చట్టం తేవడానికి  కి కూడా అలాగే పోరాటం చేస్తామన్నారు.  ఆనంద్  గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉన్నదని న్యాయ స్దానం కు వస్తె తమకు న్యాయ జరుగుతుందని నమ్మి వస్తారని అన్యాయం ప్తె పోరాడితే అలాంటి న్యాయ వాదులను బెదిరించడం దారుణమని నడి రోడ్డు ప్తె దారుణంగా హత్య చేసిన వ్వక్తుల కఠినంగా శిక్షించాలని అనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయ వాది   బి.లింగం , గౌస్ పాష, రవీందర్ , శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...