Followers

ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు భీమా కలిగి ఉండాలి

 ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు భీమా కలిగి ఉండాలి

 - లేబర్ ఆఫీసర్ జగద్వీశర్ రెడ్డి

 గుడిహత్నూర్ ,  పెన్ పవర్

ప్రతీ ఒక్క భవన నిర్మాణ కార్మికుడు భీమా తప్పనిసరిగా చేయించుకోవాలని లేబర్ ఆఫీసర్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బోథ్ మండల కేంద్రంలో గురువారం భవన నిర్మాణ కార్మికులకు భీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  ప్రతీ ఒక్క కార్మికుడు భీమా చేయించుకోవాలని అన్నారు. భీమా చేసుకున్నవారికి అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే 6 లక్షల 30 వేల రూపాయలు మరియు సహజ మరణం అయితే 1లక్ష 30 వేలు మంజూరు అవుతాయని అలాగే కార్మికుని కూతురు వివాహం అయితే రు.వేలు,ప్రసవాలకు కూడా రు.30వేలు మంజూరు అవుతాయని తెలిపారు. ప్రమాదంలో గాయాలపాలైతే గాయాల తీవ్రతను బట్టి లక్ష నుండి 5 లక్షల వరకు భీమా క్లయిమ్ అవుతుందని తెలిపారు .ఇది కేవలం భవన నిర్మాణ కార్మికులు మాత్రమే వర్తిస్తుందని భవన నిర్మాణ కార్మికులు మాత్రమే  అన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిందేకర్ సంజయ్,మంగారపు రాజు,సిందేకర్ గంగాధర్,పుట్టి నరేష్,రామెల్లి శ్రీనివాస్ మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...