Followers

వృద్ధులకోసమే ముఖ్యమంత్రి జగన్ తపన.. ఎమ్మెల్సీ సురేష్

వృద్ధులకోసమే ముఖ్యమంత్రి జగన్ తపన.. ఎమ్మెల్సీ సురేష్
విజయనగరం,పెన్ పవర్

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం రాష్ట్రంలో ని వృద్ధులకి సహాయం చెయ్యడానికి నిరంతరం ఎంతో తపనతో ఆలోచనలు చేస్తున్నారని అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వృద్ధులకి అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో నే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యానారాయణరాజు (సురేష్ బాబు)అన్నారు,జామి మండలం అట్టాడ గ్రామంలోని బి.ఎన్.ఆర్.అశ్రమం ప్రధమ వార్షికోత్సవం కార్యక్రమాలు ఆదివారం,సోమవారం భీశెట్టి ఫౌండేషన్ అధినేత భీశెట్టి బాబ్జి అధ్యక్షత న నిర్వహించారు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సురేశ్ మాట్లాడుతూ ఒక అశ్రమం లో సంవత్సరం పొడుగునా వృద్ధులకి బోజనాలను అందించడం చిన్న విషయం కాదని వృద్ధులను అదుకునేవారికి దేవుడి సహాయం ఉంటుందని తాను ఎమ్మెల్సీ గా ప్రమాణం చేసిన వెంటనే తన తండ్రి గారు స్వర్గీయ సాంబశివరాజు పేర ఇదే అశ్రమం లో భోజన వితరణ చేశామన్నారు, అశ్రమం కి తాను ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు,మరో అతిథి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ జిల్లా స్థాయి మహిళ, పురుషులు  ఆహ్వానపు కబడ్డీ పోటీలను ప్రారంభించారు అనంతరం రఘువర్మ మాట్లాడుతూ జిల్లాలో గొప్ప కబడ్డీ క్రీడాకారులు ఉండేవారని రాష్ట్రంలో కబడ్డీ క్రీడకు విజయనగరం జిల్లా పెట్టింది పేరని ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎంతో మంది గురువులు కబడ్డీ క్రీడను బ్ర తికిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.
 విశాఖపట్నం జిల్లా ఎల్.ఎన్.నిర్మాణసంస్థ చైర్మన్ భీశెట్టి రామకృష్ణ(రాంకి) మాట్లాడుతూ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు కి తగినంత ప్రోత్సహం అవసరమని ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు,జిల్లా స్థాయి ఆహ్వానపు కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరగడం తనకి ఆనందంగా ఉందని క్రీడాకారులు గొప్ప ఆటను ప్రదర్శించారని కితాబిచ్చారు, ఈ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు,డాక్టర్ ఎం.వెంకటేశ్వరావు,సాయి గ్యాస్ ఏజెన్సీ అధినేత శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ అమ్మన్న దొర, ఉప సర్పంచ్ బేపల సత్యం,రెడ్డిపల్లి సత్యారావు, షేక్ పీరు,తో పాటుగా గెలుపొందిన క్రీడాకారులకి బహుమతులు విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, జిల్లా మెప్మా పోజక్టు అధికారి కోట్ల సుగుణాకరరావు,సమన్విత అధినేత గొలుగురు నాగిరెడ్డి, లగుడు రవికుమార్, గులిపల్లి జయపాల్, ఆళ్ల లోకేష్,జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు రంగారావు దొర, కమలనాబరావు,లక్ష్మణరావు, గోపాల్,తదితరులు పాల్గొన్నారు, ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు బట్టలు అందించారు కబడ్డీ పోటీలు తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...