తమ్ముళ్లు.. రవిశంకర్ యువకుడు చదువుకున్నవాడు
రవి శంకర్ నీ గెలిపించండి...చంద్రబాబు నాయుడు
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో లో మాట్లాడుతూ ఈ దొంగలకు మేయర్ పీఠం దక్కింది అంటే ప్రశాంతం గా ఉన్న వైజాగ్ ని రౌడీయిజం. గుండాయిజం తో చెలరేగిపోతారని మరో ఫ్యాక్షన్ అడ్డాగా మారుస్తారని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని నిత్యావసర సరుకులు అధిక రేట్లుపెంచేశారు.పేదవాడు రోజంత కష్టపడి వచ్చి పొరపాటున మధ్యం షాప్ కి వెళితే జోబి మొత్తం ఖాళీ మధ్యం రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచేశారు.అమ్మఒడి రూ14000 ఇచ్చి నాన్నబుడ్డీ అని ఇచ్చిన డబ్బులు వడ్డీ తో లాగేస్తున్నారు ఇవన్నీ మనం గుర్తు ఉంచుకొని తమ్ముళ్లు విశాఖ మేయర్ పీఠాన్ని టీడీపీ కి ఇచ్చి మన వైజాగ్ ని కాపాడుకుందాం. తమ్ముళ్లు 37వ వార్డు టీడీపీ అభ్యర్థి బంగారి రవిశంకర్ సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను తమ్ముళ్లు.. రవిశంకర్ యువకుడు చదువుకున్న వాడు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని చంద్రబాబు అన్నారు.
No comments:
Post a Comment