Followers

విశాఖ శారదా పీఠంను సందర్శించిన సీపీఐ నారాయణ

 విశాఖ శారదా పీఠంను సందర్శించిన సీపీఐ నారాయణ 



స్వామి స్వరూపానంద స్వామిని కలిసిన నారాయణ

పెందుర్తి, పెన్ పవర్ 

సిపిఐ నేత నారాయణ విశాఖ శారదా పీఠంలో ప్రత్యక్షమయ్యారు. జీవీఎంసీ 97వ వార్డులో ప్రచారం చేసిన ఆయన విశాఖ శారదా పీఠం ను సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. విశాఖ జీవీఎంసీ 97వ వార్డు సీపీఐ అభ్యర్ధి యశోద ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన ముషిడివాడలో నిర్వహించిన ప్రచారంలో నారాయణ పాల్గొన్నారు. అందులో భాగంగానే దారిలో ఉన్న విశాఖ శారదా పీఠాన్ని నారాయణ సందర్శించారు. ఆ పీఠాన్ని దర్శించుకుంటే గెలుపు ఖాయమని అంటుంటారని తమ అభ్యర్ధిని కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని నారాయణ కోరినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...