స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో మెకానిక్ శ్రీను
15 వ వార్డులో బీరువా జోరు
నర్సీపట్నం, పెన్ పవర్
నర్సీపట్నం మున్సిపాలిటీ 15 వార్డులో పెదిరెడ్ల శ్రీనివాసరావు (మెకానిక్ శ్రీను) స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. చివరి వరకు పార్టీ బి-ఫారం తనకే దక్కుతుందని ఆశించిన శ్రీను, వేరొకరికి బి-ఫారం అందడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ మెకానిక్ శ్రీను కు బీరువా గుర్తు కేటాయించింది. అయితే వార్డు ప్రజల కష్టసుఖాలలో తలలో నాలుకలా ఉండే మెకానిక్ శ్రీనును పోటీలో ఉండమని యువకులు, పెద్దలు పట్టుబట్టడం విశేషం. సాధారణ మెకానిక్ జీవితం గడిపే శ్రీనివాసరావు, తనకు వచ్చే ఆదాయంలో కొంత పేద ప్రజల కోసం కేటాయించటం పట్ల ప్రజల విశ్వాసం చూరగొన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా, వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ అండగా నిలిచారు. ఇవన్నీ మెకానిక్ శ్రీను గెలుపుకు దోహదపడే అంశాలు. గుర్తు కేటాయించిన వెంటనే కరపత్రాల తో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తనను గెలిపిస్తే వార్డులో పారిశుద్ధ్య పనులపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, సిసి రోడ్లు వేయిస్తానని, అవసరమైన చోట కల్వర్ట్ లు నిర్మాణం చేయిస్తానని, వీధులలో ఎల్ఈడి బల్బులు వేయిస్తానని, ప్రతి వీధిలో రెండు చెత్తకుండీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజలంతా మెకానిక్ శ్రీనుకు పట్టం కట్టేందుకు ఉత్సాహపడుతున్నారు. బీరువా గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే , మున్సిపాలిటీ లోనే 15 వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెకానిక్ శ్రీను హామీ ఇస్తున్నారు.
No comments:
Post a Comment