తక్షణమే స్పందించారు - ఆసుపత్రికి తరలించారు
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం మండలం 26వ నంబరు జాతీయ రహదారి పై మార్చి 29న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పాలకొండ నుండి విశాఖపట్నం వెళ్ళుతున్న ఆర్టీసి బస్సు ముందుగా వెళ్ళుతున్న గ్యాస్ సిలిండర్స్ లారీని దాటుకొని వెళ్ళే క్రమంలో ఎదురుగా విశాఖపట్నం నుండి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసి బస్సును ఢీ కొనడం, గ్యాస్ సిలిండర్స్ లారీ డ్రైవరు కూడా లారీని అదుపు చేయలేక విజయనగరం నుండి విశాఖ వెళుతున్న ఆర్టీసి బస్సు వెనుక భాగంను బలంగా ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సంఘటనా స్థలంకు చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను బస్సుల్లో నుండి బయటకు తీసి, పోలీసు వాహనాలు, 108 అంబులెన్సు వాహనాల్లో చికిత్స నిమిత్తం విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంకు దగ్గరగా ఉన్న 5వబెటాలియన్ కమాండెంట్ జే. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బెటాలియన్ పోలీసులు కూడా సంఘటనా స్థలంకు చేరుకొని,స్థానికుల సహాయంతో సహాయక చర్యల్లో చురుకైన పాత్ర పోషించారు.
రహదారిపై ట్రాఫిక్ కు విఘాతం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు, విజయనగరం రూరల్ పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషను చేపట్టగా, రహదారిపై వాహనాలను క్రేన్లు సహాయంతోప్రక్కకు తీయించారు. విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆధ్వర్యంలో విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, సిఐలు టి.ఎస్.మంగవేణి, శ్రీధర్, జె.మురళి, సిహెచ్. శ్రీనివాసరావు,రూరల్ ఎస్ఎ పి. నారాయణరావు మరియు ఇతర పోలీసుఅధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య సహాయం అందే విధంగాచర్యలు చేపట్టారు. మెరుగైన వైద్య సహాయం అవసరమైన ఆరుగురిని విశాఖపట్నం కేజి హెచ్ కు తరలించారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందించేందుకు పర్యవేక్షణాధికారిగా ప్రత్యేకంగా ఒక తాశీల్దారును కూడా కేజిహెచ్ కు పంపారు.సంఘటనా స్థలాన్ని విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు ఉదయాన్నే సందర్శించి, సంఘటన జరిగిన తీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని, క్షతగ్రాతులను పరామర్శించి, వారిలో మనోధైరాన్ని నింపారు. మృతి చెందిన కుటుంబాలను ఓదార్చారు.
మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాల్సిందిగా పోలీసు అధికారులను విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణమే స్పందించిన 5వ బెటాలియన్ కమాండెంట్ జే.కోటేశ్వరరావు, 5వ బెటాలియన్ పోలీసు అధికారులు,సిబ్బందిని విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు, విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ప్రత్యేకంగా అభినందించారు.విశాఖపట్నం రేంజ్ డిఐజి,జిల్లా ఎస్పీ బి. రాజకుమారి వెంట జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కిషోర్ కుమార్, పార్వతీపురం ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, ఆర్డీఓ భవానీశంకర్, విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సిఐ జి. రాంబాబు, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్.శ్రీనివాసరావు, రూరల్ సీఐ టి.ఎస్.మంగవేణి, భోగాపురం సిఐ శ్రీధర్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment