అరకు జిల్లా ఉపాధ్యక్షుడు గా బొల్లా ప్రసాద్....
ఎటపాక, పెన్ పవర్
అరకు జిల్లా ఉపాధ్యక్షుడు గా బొల్లా ప్రసాద్ ఎంపిక పట్ల ఎటపాక మండల కమిటీ హర్షం వ్యక్తం చేశారు. ఎటపాక మండల అధ్యక్షుడు మోదుగు పెరమయ్య అధ్యక్షతన శుక్రవారం గన్నవరం గ్రామంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా బొల్లా ప్రసాద్ ,ఓబీసి జిల్లా అధ్యక్షుడు రాయిని రమేష్ ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు,జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు అరకు జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పాంగి రాజరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బొల్లా ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం లొనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.అందరి సహకారంతో గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని అన్నారు.రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితలు ఎదుర్కొంటున్న సమస్యలు ను కేంద్రం దృష్టికి తీసుకవెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అభ్యర్థి సరియం శ్రీను, కొరకాసుల రామకృష్ణ, కె శేఖర్, కాకా సీత, మూడే సతీష్ కుమార్ పాల్గొన్నారు....
No comments:
Post a Comment