కేయూ లో జర్నలిస్టుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి....!
జర్నలిస్టుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ....!!
పెన్ పవర్,మరిపెడ
కాకతీయ యూనివర్సిటీలో వార్త కవరేజ్ చేయడానికి వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ రాము కెమెరామెన్ బిక్షపతిలపై టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ప్రశాంత్ అతని అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య ఆని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మరిపెడ మండలం జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి పైన స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలతో ధరించి ప్లే కార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవారధిగా ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ గా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుచేట్టు ఆని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని ఎంతటి వారైనా శిక్షలు తప్పవని వారు హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మరిపెడ తాసిల్దార్ రమేష్ బాబుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గాడి పల్లి శ్రీశైలం ,జిన్నా లచ్చ న్న, గండి విష్ణు, వీరాంజి, చంద్రశేఖర్ , పి వేణు , బోడ నాగేందర్ ,మచ్చ రాజేష్, దోమల శ్రీనివాస్, కారంపొడి వెంకటేశ్వర్లు, రియాజ్ పాష, మెరుగు సంజీవ, గండి నాగరాజ్, అయినాల రాజేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment