మేడ్చల్ లో శాఖాహార, మాంసాహార మార్కెట్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్ శ్వేత మహంతి..
పెన్ పవర్,మేడ్చల్
మేడ్చల్ పురపాలక సంఘ పరిధిలో ఇంటిగ్రేటెడ్ శాఖహార మరియు మాంసాహార మార్కెట్లు ను ఏర్పాటు చేయుటకు స్థల పరిశీలన కోసం మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మరియు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ సాంసాన్ మేడ్చల్ పట్టణమునకు విచ్చేశారు... మేడ్చల్ పట్టణములో ఆర్ అండ్ బి బిల్డింగ్ స్తలము మరియు పాత గవర్న్మెంట్ హాస్పిటల్, రైతు బజారు కలుపుకొని ఇంటిగ్రేటెడ్ శాఖహార మరియు మాంసాహార మార్కెట్లు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ శ్వేతా మహతి స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మాట్లాడుతూ ప్రతి శాఖహార, మరియు మాంసాహార, దుఖాణ యజమానులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలోనే వ్యాపారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ ఛైర్పెర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి, వైస్ ఛైర్మన్ చీర్ల రమేశ్, 14వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేశ్, టిఆర్ఎస్ నాయకులు మర్రి నర్సింహా రెడ్డి, ఆర్. మధుకర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సాయి రాంరెడ్డి, టిపియస్ రాజీవ్ రెడ్డి, గవర్నమెంట్ సర్వేయర్ వెంకటేష్ , సానిటరీ ఇన్స్పెక్టర్ కె. రాంచందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment