Followers

ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పెన్నిధి.

 ముఖ్యమంత్రి కెసిఆర్  పేదల పెన్నిధి...

 జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్

ఆదిలాబాద్, పెన్ పవర్ 

  దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పెన్నిధి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ అన్నారు. బుధవారం మండలంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను మండల తెరాస నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఏ రాష్ట్రంలో ఆడపడుచులకు లేనటువంటి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అంటే అది కెసిఆర్ పుణ్యమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రె,ఆడనేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మాజీ ఎంపిపి రఘుకుల్ రెడ్డి, తహసిల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్,టిఆర్ఎస్ నాయకులు తన్విర్ ఖాన్, మంగేష్, సుధాకర్, సుభాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నారాయణ, గీత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...