కాంగ్రెస్ పార్టీలో పలువురు బారి చేరిక
అరకు, పెన్ పవర్
అరకు వేలి నియోజవర్గం సుంకర మెట్ట పంచాయతీ దండబడు,సంగంవలస,దవడగుడ,దాబ్ గుడ అట్టగూడ గ్రామలు నుండి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై 10 మంది వైసీపీ కార్యకర్తలు బురిడి లక్ష్మి,వంతల బర్సు నాయుడు,వంతల సుశీల, బురిడి శ్రీను,కే చిన్నారావు,బిర్సు పాల్లకి,పటెలి లైబన్ వారు తోపాటు 130 కుటుంబాలు ప్రజలు పీసీసీ ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాంత కుమారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల విసిగిపోయి ఉన్నారని అన్నారు ప్రజలు గత కాంగ్రెస్ పాలనే ప్రజారంజకంగా సాగిందని నేటి ప్రభుత్వాలు వారి ఉనికి చాటుకోవడానికి అన్నట్లుగా ఉన్నారు తప్ప ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సూచికలుగా కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు కలలో మార్పు వచ్చిందని ఆ మార్పే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టంనాయక్ కోములు, అరకు వేలి మండల కాంగ్రెస్ నాయకుడు పాచి పెంట చిన్న స్వామి,మండల యుత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మెషీయ ప్రెమ్ కుమార్,తేడబరికి బిమరావు,గుంజిడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment