Followers

ఎలాంటి అర్హత లేని పీజీ విద్యార్థులచే పరీక్షల ఇన్విజిలేషన్

 ఎలాంటి అర్హత లేని పీజీ విద్యార్థులచే పరీక్షల ఇన్విజిలేషన్

తార్నాక, పెన్ పవర్ 

ఎలాంటి అర్హత అనుభవం లేని డిగ్రీ,పీజీ చదివే విద్యార్థులతో  పరీక్షల  ఇన్విజిలేషన్ చేపిస్తూ కొన్ని ప్రయివేటు కళాశాలల దనార్జనే ద్యేయంగా వ్యవహరిస్తున్నాయని ప్రైవేట్  డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ సమితి అధ్యక్షుడు కట్ట శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ,పీజీ కళాశాల యాజమాన్యాలు ఇలా వ్యవరిస్తున్నా ఇటు అధికారులు అటు ప్రభుత్వాలు పట్టించుకోకుండా వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. దీనివల్ల అన్ని అర్హతలు ఉన్న లెక్చరర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం యూనివర్సిటీ ఆడిట్ సెల్ అధికారుల దృష్టికి  తీసుకువెళ్లిన పట్టీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అట్టి అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తామని కట్ట శేఖర్ తెలిపారు. అయిన కూడా స్పందించని పక్షంలో  ప్రయివేటు డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ ఆధ్వర్యంలో  ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...