దళారులను నమ్మొద్దు..డబ్బులు ఇవ్వొద్దు..
ఆసుపత్రి వైద్యం కోసం ముఖ్యమంత్రి నిధినుండి చేసే సహాయం..
సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన కెయంప్రతాప్ గౌడ్..
జీడిమెట్ల, పెన్ పవర్ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తాము డబ్బులు ఇప్పిస్తామంటూ ఎవరైనా దళారులు తారసపడితె ఎవరికీ డబ్బులు ఇవ్వ వద్దని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కె.యం.ప్రతాప్ గౌడ్ లబ్దిదారులకు సూచించారు..పంచశీల కాలనీకి చెందిన కె.లక్ష్మికి హార్ట్ ఆపరేషన్ చేయగా, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కే.యం.ప్రతాప్ గౌడ్ చొరవతో, సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన రూ.60 వేల చెక్కును ఆయన లబ్ధిదారులకు శనివారం అందజేశారు..ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, ఎమ్మెల్యే ఇచ్చినా, తాను ఇచ్చినా, మరి ఏ నాయకుడు ఇచ్చిన, ఎవరికీ ఎటువంటి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులతో కె.యం. ప్రతాప్ గౌడ్ పేర్కొన్నారు.. దళారులు మోసంచేసి డబ్బులు గుంజుతారని సూచించారు..
No comments:
Post a Comment