Followers

దూలపల్లి అడవిలో భారీ అగ్ని ప్రమాదం

 దూలపల్లి అడవిలో భారీ అగ్ని ప్రమాదం

ఎగిసిపడిన మంటలు సుమారు 15 ఎకరాల అడవి దగ్ధం అయినట్టు అంచనా

కాలీపోయిన వెదురు పొదలు రక్షణ చర్యలు చేపడతామన్న మేడ్చల్ జిల్లా డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు

కొంపల్లి మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్లతో నీటి సరపరా చేసి మంటలు ఆర్పారు

జీడిమెట్ల ఫైర్ ఇంజన్లతో సిబ్బంది సకాలంలో స్పందించారు డిఎఫ్ఓ

ఆకతాయిలు చేసి ఉంటారని భావిస్తున్న అటవీశాఖ అధికారులు

అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా సంభందిత ఫారెస్ట్

విచ్చల విడిగా ఖాళీ మద్యం బాటిళ్ళు అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం

ఇకమీదట అడవిలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు:ఎఫ్ఆర్ఓ శ్రీదేవి

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

హైదరాబాదు శివారులో ఉన్న దూలపల్లి ఫారెస్ట్ అకాడమిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ప్రమాదానికి కారణం ఆకతాయిల పనే అయిఉంటుందని భావించిన అధికారులు..కావాలనే నిప్పు అంటించి ఉంటారని అటవీశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఈ అటవీ ప్రాంతం కొంపల్లికి వెళ్ళే రహదారి ప్రక్కనే ఉండడంతో.. బహిరంగంగా మధ్యం సేవించే వారు మధ్యం సేవించి అనంతరం ఈప్రమాదానికి కారణం కావచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు.. మైసమ్మగూడాలోని కళాశాల విద్యార్థులు కూడా అయి ఉండవచ్చని.. పలుమార్లు విద్యార్ధులను పట్టుకొని కౌన్సింగ్ కూడా ఇచ్చామని.. దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారిని శ్రీదేవి తెలిపారు..అగ్ని ప్రమాదంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారిని శ్రీదేవి తెలిపారు.. కొంపల్లి మున్సిపల్ కమీషనర్ రఘు,మున్సిపల్ చైర్మెన్ శ్రీశైలం యాదవ్, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.. గండిమైసమ్మ దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు ఆర్ఐ శణ్ముఖం, విఆర్ఓ రజిత అగ్ని ప్రమాదం సంభవించిన స్థలానికి వచ్చి పరిశీలించి పంచనామ చేశారు.. సంఘటనపై తహసీల్దారు భూపాల్ కు రిపోర్ట్ చేస్తామని ఆర్ఐ షణ్ముఖం తెలిపారు.

అసాంగీక కార్యకలాపాలకు ఆనవాళ్లు మధ్యం బాటిళ్లు అగ్ని ప్రమాదం సంభవించిన ఈప్రాంతంలో పెన్సింగ్ రక్షణ లేక పోవడంతోనే ఆకతాయిలకు ఈప్రదేశం అడ్డాగా మారిందని పలువురు అబిప్రాయం తెలియజేస్తున్నారు.ఈ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.. నగర శివారులోని అడవుల సుందరీకరణ, రక్షణ చర్యలలో భాగంగా ఇప్పటికే బహుదూర్ పల్లి, దూలపల్లి, బౌరంపేట వద్ద ఇనుప జాలి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు.. అటవీ లోపల నడక మార్గాలను కూడా సుందరీకరణగా తీర్చి దిద్దుతున్నామని, ఈప్రాంతంలో విచ్చలవిడిగా మధ్యం సేవిస్తున్నట్లు మధ్యం బాటిళ్ళు పడేసి ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణ రోజంతా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో మధ్యం సేవిస్తున్నట్లు అటవీప్రాంతం ప్రమాద స్థలంలో ఉన్న ఆదారాలు చెపుతున్నాయి.. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటామని డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

వేసవి ప్రారంభం కావడంతో ఎండు ఆకులతో అటవీప్రాంతం నిండి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి చెట్లు దహనం అయ్యాయని..అటవీ సిబ్బంది సమాచారంతో సంఘటనా స్థలానికి కొంపల్లి మున్సిపల్ సిబ్బంది సకాలంలో స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేసి మంటలను అదుపులోకి తేవడంలో మున్సిపల్ సిబ్బంది తీవ్ర కృషి చేశారని అటవీ అధికారులు తెలిపారు.. పైర్ సిబ్బంది కూడా సహకరించారని, మంటలను అదుపులోకి తెచ్చారని అటవీ అధికారులు అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...