Followers

వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి

 వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి

మందమర్రి ఎస్సై భూమేష్

మందమర్రి,  పెన్ పవర్

కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒకరు సామాజిక దూరం పాటించాలని ఎస్సై భూమేష్ పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మలిదశ కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒకరు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. అవసరం మేరకే బయటకు రావాలని, తప్పక మాస్క్ ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నామనే ధోరణితో ఇష్టా నుసారంగా సంచరించరాదని అన్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని తప్పక ఆరోగ్య సూత్రాలను పాటించాలని మీ నిర్లక్ష్యం ఎదుటి వారికి శాపంగా మారోధ్దని అన్నారు. జీవో 68 ప్రకారం మాస్క్ ధరించని వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...