తెలుగుదేశంపార్టీ తరపున విజయం సాధించిన సర్పంచ్ లకు అభినందన సభ
పెన్ పవర్,ఆలమూరు
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బుధవారం కొత్తపేటలో అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, టిడిపి అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి పాల్గొని విజేతలను ఘనంగా సన్మానించి అభినందించారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆలమూరు మండలం కలవచర్ల గ్రామం సర్పంచ్ గా విజయం సాధించిన వడ్డి వెంకన్నను దుశ్శలవాల, పూల మాలలుతో సత్కరించి సన్మానించారు అలాగే పలు గ్రామాల్లో ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.
No comments:
Post a Comment