అందాల ఆదిలాబాద్ జిల్లాలో పక్షులను కెమెరాలో బంధించడం అభినందనీయం...
ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనిషా, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
ఆదిలాబాద్ , పెన్ పవర్రేడియేషన్ కాలుష్యంతో అంతరించిపోతున్న పక్షులను ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో అందాల ఆదిలాబాద్ జిల్లాలో పక్షులను బంధించడం అభినందనీయమని ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ 43వా వార్డు లో ప్రపంచ పిచ్చుకల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ అడవుల్లో పక్షులను కెమెరాతో బంధించిన లింగంపల్లి కృష్ణను శాలువా మెమొంటో తో సత్కరించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ తో కలిసి పక్షుల నీటి దాహం తీర్చడానికి 200 పైగా మట్టి పాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాలు చెట్లు నాటడం తోనే ఈరోజు ఆదిలాబాద్ కు పక్షులు తిరిగి రావడం సంతోషకరమన్నారు. అంతరించిపోతున్న పక్షులకు హరిత హారం కార్యక్రమాల్లో మొక్కలు నాటి తెలంగాణ ప్రభుత్వం పక్షులను రక్షిస్తుందని పేర్కొన్నారు. గుట్టల అందాలు చెట్లను ఫొటోలు తీయొచ్చు కానీ, పక్షులు ఎప్పుడు ఎగిరి పోతాయో తెలియని ఫోటోలను లింగంపల్లి క్రిష్ణ కెమెరాలో బంధించడం, పక్షుల పేర్లు తెలుసుకొని మన దృష్టికి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రపంచంలో ఇన్ని రకాల పక్షులు ఉన్నాయా అని, భావితరానికి తెలియపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందాల అడవుల జిల్లా అంటే అదిలాబాద్ జిల్లా అని అలాంటి మన జిల్లాను పక్షుల ఫోటోలు తీసి ప్రజలకు పరిచయం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ డి. ఎఫ్. ఓ, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు రంగినేని పవన్ రావు, వార్డు ప్రజలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment