రేపు జరిగే న్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి
టిఆర్ఎస్ యువ నేత యాకాంతం గౌడ్
నెల్లికుదురు,పెన్ పవర్
మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించే పట్టభద్రుల సన్నాహక సమావేశా న్ని విజయవంతం చేయాలని,స్థానిక పట్టభద్రుల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లారాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని టిఆర్ఎస్ యూత్ డివిజన్ అధ్యక్షుడు చిర్రయాకాంతం గౌడ్ కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లో టిఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించి శనివారం మండల కేంద్రంలో నిర్వహించే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పట్టభద్రులను కలిశారు.ఈ సందర్భంగా చిర్ర యాకాంతం గౌడ్ శ్రీ రామగిరి సహకార సంఘం అధ్యక్షుడు గుండవెంకన్న తో కలిసి మాట్లాడుతూ.. ప్రశ్నించడం కాదు సమస్యలను పరిష్కరించే నాయకుడిగా రాజేశ్వర్ రెడ్డి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడుగుదేవీరన్న,చిన్న ముప్పారంఎంపిటిసి కదిరిజగన్ , ఆలేరు ఉపసర్పంచ్ షేక్ షరీఫ్ సర్పంచ్ ఫోరం మాజీ మండల అధ్యక్షుడు దర్శనంబిక్షపతి, నాయకులునామాలమహేష్, రాయలిసంతోష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment