Followers

త్యాగాల పునాదుల మీద నిర్మితమైన విశాఖఉక్కు పైవేటీకరణ ఘర్హనీయం...

 త్యాగాల పునాదుల మీద నిర్మితమైన విశాఖఉక్కు పైవేటీకరణ ఘర్హనీయం...

విశాఖపట్నం, పెన్ పవర్

ఎందరో త్యాగధనుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైన విశాఖఉక్కు ప్రైవేటీకరణ ఘర్హనీయమని యూపీఎస్సి మాజీ చైర్మన్, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ కె.ఎస్.చలం పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రవిశ్వ విద్యాలయం టిఎల్ఎన్ సబాహాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఉక్కును ప్రయివేట్ పరం చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నా మన్నారు. విశాఖఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమ నినాదంతో జరిగిన ఉద్యమంలో నాడు 32మంది త్యాగధనులైన ఉద్యమకారులు నేలకొరిగి స్టీల్ ప్లాంట్ సాధించారని, ఈ ప్రాంత అభివృద్ది, ఉపాధికి స్టీల్ ప్లాంట్ పట్టు కొమ్మగా నిలుస్తోందన్నారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని, ఇటువంటి వికృతపోకడలను నిలదీయాల్సిన మీడియా తన స్వతంత్రాన్ని కోల్పోయి, చేష్టలుడిగి చూస్తూ కూర్చోవడం 21వ శతాబ్దంలోని ప్రమాదకరమైన ఉపద్రవంగా ఆయన ఆందోళన వెలిబుచ్చారు. 

ఆత్మనిర్బర్ భారత్ పధకం క్రింద  కేటాయించిన 21 లక్షల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ఎంతకో కొంతకి తెగనమ్మడమేనా ఆత్మనిర్భర భారత్ యొక్క ముఖ్యోద్దేశ్యం అని ఆయన నిలదీశారు. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న రాయితీ లలో 10 శాతం స్టీల్ ప్లాంట్ కు ఇచ్చిన గట్టెక్కుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ జాతీయ సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ 32వేలమంది ఉద్యోగులు పనిచేసే నవరత్నాల్లోని ఒక ప్రధాన పరిశ్రమనే ప్రయివేటు చేతుల్లోకి ఇచ్చేస్తే, మిగిలిన చిన్నా, చితకా పరిశ్రమలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ప్రశ్నించాల్సిన వారు ప్రశ్నించకుండా ఊరుకుంటే దేశం మొత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోవడానికి ఎంతోకాలం పట్టదన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్, ఐఎన్టియుసి అధ్యక్షులు గంధం వెంకట్రావు, ఏ ఐ టి యు సీ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి తదితరులు మాట్లాడుతూ నష్టాల పేరిట విశాఖ ఉక్కు ను కార్పొరేట్ కంపెనీ లకు అమ్మాయిలని కేంద్రం నిర్ణయించింది అని అన్నారు నిజంగా కేంద్రానికి నష్టాలే కారణంగా కనిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర సీనియర్ జర్నలిస్ట్ ఐ జే యు జాతీయ ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఓ చారిత్రాత్మక విశాఖ నగరానికి కి కేంద్రబిందువైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఏ వ్యక్తి అంగీకరించడని అన్నారు.  ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి దశాబ్దాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ పునాది వేసింది అని ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా ఉత్తరాంధ్ర శిధిలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జై జై యు జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ సోమసుందర్,ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, అచ్యుతరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి రాము ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ నగర అధ్యక్షులు రావుల వలస రామచంద్ర రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉద్యమం లో ప్రతి జర్నలిస్టు భాగస్వాములు అవుతారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రాము నగర శాఖ ప్రధాన కార్యదర్శి కే చంద్ర మోహన్, ఉపాధ్యక్షులు శ్రీరాములు,ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు గంటల ప్రసాద్, అశోక్,రవి,విద్యార్థి నాయకులు హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.సదస్సు అనంతరం స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...