విద్యాసంస్థలు మూతపడడంతో అయోమయంలో విద్యార్థులు...
ఎస్ ఎఫ్ డి కన్వీనర్ మాడ వార్ హరీష్
బేల, పెన్ పవర్
రాష్ట్రంలో అమాహ్యంగా పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యాసంస్థలు మూసివేస్తూ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఏబీవీపీ జిల్లా ఎస్. ఎఫ్. డి కన్వీనర్ మడవార్ హరీష్ తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల మూసివేతతో విద్యార్థులు అయోమయంలో పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ప్రారంభించిన విద్యాసంస్థల్లో. వసతి గృహాల్లో కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక నిధులు విడుదల చేయలేదని తెలిపారు. విద్యా సంస్థలు ప్రారంభించిన తర్వాత కోవిడ్ నిబంధనలు పాటించేేలా చేయడంతో అదికారులు విఫలం అవడంతో కేసులు పెరిగిపోయాయన్నారు.
No comments:
Post a Comment