Followers

ఆలమూరులో భారత్ బంద్ విజవంతం

 ఆలమూరులో భారత్ బంద్ విజవంతం

పెన్ పవర్,ఆలమూరు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వినాశకరమైన మూడు వ్యవసాయ చట్టాలు,విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనుచిత నిర్ణయాలకు నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాలు ,వామపక్ష కార్మిక సంఘాల ఇచ్చిన భారత్ బంద్ పిలుపుమేరకు శుక్రవారం ఆలమూరు మండలంలో తెలుగుదేశం, సిపిఐ, సిపియం,కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుండి , బస్టాండ్ మీదుగా కొత్తూరు సెంటర్ వరకు అఖిలపక్ష శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి, కొండేటి రామకృష్ణ మాట్లాడుతూ, నేడు జరుగుతున్న భారత్ బంద్ రైతులకు,కార్మికులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశంలో గల రైతులు కూలీలు తో పాటు వర్తక వ్యాపార ప్రతినిధులు, ఉద్యోగ కార్మిక సంఘాలు తమ సంఘీభావం తెలిపాయ్యన్నారు.


కోట్లాది మంది ప్రజలకు ఆహార ధాన్యాలు పండించే అన్నం పెట్టే రైతన్న కు ఉరితాడు లాంటి మూడు నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు ఈ ప్రజా పోరాటం కొనసాగుతుందన్నారు.అలాగే టీడీపీ మండల కన్వీనర్ మెర్ల గోపాలస్వామి మాట్లాడుతూ నల్ల చట్టాలను తెచ్చి కర్షక సోదరులను కాటు వేయాలని చూస్తుందన్నారు,విశాఖను ప్రైవేట్ పరం చేసి కార్మికులు రోడ్డున పడితే దాని వల్ల జరిగే పరిణామాలకు,కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు జి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం చాలా  దుర్మార్గమైన చర్య అని అలాగే ప్రజలు తినడానికి ఉపయోగించే  నిత్యఅవసర సరుకులు  ధరలతో పాటు గ్యాస్,  పెట్రోలు, డిజిల్  ఆకాశాన్నిఅంటేలా పెరిగిపోయాయి అని ఇలాంటి ప్రభుత్వాలను ప్రజలు ఊరికే వదలిపెట్టారని తెలియజేశారు    ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ ఈదల నల్లబాబు,సొసైటీ మాజీ అధ్యక్షులు వంటిపిల్లి సతీష్,సాలి సత్యనారాయణ, కేతా రాంబాబు,పెందుర్తి యాకోబు,యమ్ రాజగోపాల్,రాంప్రసాద్,  లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...