విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటి కరణ చర్యలను వెనక్కి తీసుకోవాలి
పరవాడ,పెన్ పవర్
కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటి కరణ నిర్ణయనికి వ్యతిరేకంగా జరుగుతున్న రాష్ట్ర బంద్ లో భాగంగా లంకెలపాలెం జంక్షన్ లో సిఐటియు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో రాస్తారోకో కార్యక్రామాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలను చవకగా అమ్మేసి విదేశీ మరియు దేశీయ ప్రవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని చూస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విదేశీసంస్థ ల ముందు తాకట్టు పెట్టాలని అని నిర్ణయించింది అని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దగాకోరు విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం పెట్రోల్,డీజిల్, గ్యాస్,నిత్యావసర సరుకుల ధరలను విరివిగా పెంచి సామాన్య మానవుడి పై అధిక భారాలు మోపుతోందని గర్జించారు.కార్మిక చట్టాలు పూర్తిగా మార్చేసి ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా మారి కార్మిక వర్గాలను బానిసలుగా మార్చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఆందోళనకు టిడిపి నాయకులు రౌతు శ్రీనివాసరావు,స్టేట్ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు మంత్రి గిరి ప్రసాద్, సంతోష్, సిఐటియు నాయకులు కరణం వెంకట్రావు,ఎం అప్పారావు,సత్తిబాబు,ఉ రవణ తదితరులు పాల్గొన్నారు. లంకెలపాలెం జంక్షన్ లో షాపులు,ప్రభుత్వ కార్యాలయాలు,బంద్ నిర్వాహకులు ముంచి వేశారు.పరవాడ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
No comments:
Post a Comment