భారత్ బంద్ లో పాల్గొన్న భీమిలి టి.డి.పి, నాయకులు
భీమిలి, పెన్ పవర్
రైతులకు నష్టపరిచే వ్యవసాయ చట్టాలకు ,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ కరణకు వ్యతిరేకంగా దేశమంతా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భీమిలి జోన్ 3వ వార్డులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బంద్ లో పాల్గొన్నారు. విద్యా సంస్థలను,దుకాణాలను,రవాణా వాహనాలను, ప్రభుత్వ మద్యం దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించడమైనది. తెల్లవారుజామునే రోడ్డుమీదకు వచ్చిన కమ్యూనిస్టులతో కలసి బందులో పాల్గొన్న అనంతరం రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ ప్రత్యక్షంగా 25వేల మందికి, పరోక్షంగా లక్షన్నర మందికి, వివిధ అనుబంధ సంస్థలు ద్వారా కొన్ని వేలమందికి ఉపాధిని కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి నశించాలని, వెంటనే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని " విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" నినాదంతో రాజకేయ పార్టీలకతీతంగా ఉద్యమాలు చేసారని 32 మంది బలిదానం పొందారని అన్నారు.
ఉక్కు ప్యాక్టరీని నిర్మించడం కోసం కొన్ని వేల ఎకరాలు భూమిని తెలుగువారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇచ్చారని అన్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ కే తలమానికం అయిన ఉక్కుపరిశ్రమను అమ్మేయలనుకోవడం చాలా హేయమైన చర్య అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాలు వస్తున్నాయని చెప్పి అమ్మేస్తుంటే ఇక ప్రభుత్వాలు ఎందుకని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్ని వేల కోట్లు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ని అప్పులాంధ్ర ప్రదేశ్ గా మార్చారని, ఇప్పుడు అప్పులున్నాయని ఆంధ్రప్రదేశ్ ని కూడా ప్రయివేట్ వ్యక్తులకు అమ్మేస్తారా..? అని గంటా నూకరాజు ప్రశ్నించారు. 2లక్షల కార్మికులు పనిచేసే ఉక్కు ప్యాక్టరీకి ముడిచరుకు సమకూర్చడం చేతకాని ప్రభుత్వం, అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారని అన్నారు. ఎంతోమంది ముందుకు వచ్చి కొన్ని వేల ఎకరాలు భూమిని విరాళంగా ఇచ్చారని, ఇది ఏమైనా మీ బాబు సొత్తా అని ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన చర్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రరూపం దాల్చుతామని హెచ్చరించారు. అదేవిధంగా 130 కోట్ల భారతీయులు ఉండే ఈ దేశంలో పుట్టిన ప్రతీ రైతు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు సరైనవి కావని, దీనివలన రైతులకు తీవ్రమైన నష్టం వచ్చే అవకాశం ఉందని దేశ రాజధానిలో సైతం రైతులు ఉద్యమాలు చేస్తుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని గంటా నూకరాజు అన్నారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలని కమ్యూనిస్టులతో కలసి డిమాండ్ చేశారు.భీమిలి మెయిన్ రోడ్డు,గంటస్థంభం, బస్టాండ్, చిన్న బజార్ కూడలిలో తిరుగుచూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారోజు సత్యవరప్రసాద్, కాసరపు నాగరాజు, పెంటపల్లి యోగీశ్వరరావు, మారోజు సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు, కాసరపు ఎల్లాజి, కొక్కిరి అప్పన్న, సంకురుబుక్త జోగారావు, అప్పికొండ నూకరాజు, కంచెర్ల కామేష్, అల్లిపిల్లి సతీష్, వియ్యపు పోతురాజు,వాడమొదలు రాంబాబు, పిల్లా తాతారావు, వాసుపల్లి వంశీ, అరసవిల్లి అనిల్, సత్తరపు చిన్న తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment