Followers

కార్పోరేషన్ ఆదాయానికి..అధికారులే అడ్డంకి

 కార్పోరేషన్ ఆదాయానికి..అధికారులే అడ్డంకి..

భాజాపా నాయకులు అక్రమ నిర్మాణాల వద్దనే పత్రికా సమావేశంలో ఆరోపణలు..

అక్రమ నిర్మాణాలకు స్వర్గధామం నిజాంపేట కార్పొరేషన్..  

అనుమతులు లేని నిర్మాణాల చర్యలపై కమీషనర్ దాటవేసే ధోరణి..

చర్యలు తీసుకోవాలన్నా..నోటీసులు జారీ చేయాలన్నా..నిర్ణయం పాలక వర్గానిదే..

అధికార పార్టీకి చంకలో చంటి పిల్లాడిగా నిజాంపేట్ కార్పోరేషన్.. 

కాలంచెల్లిన గ్రామపంచాయతి అనుమతులు 60-70 నిర్మాణాలు..

సుమారు 1000 నిర్మాణాలు అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు..

సెక్షన్181 ప్రకారం తెలంగాణ మున్సిపల్ యాక్ట్-2019 సీజ్ చేసినా యధావిధిగా నిర్మాణాలు..

మున్సిపల్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న పట్టణ ప్రణాళిక విభాగం..





కుత్బుల్లాపూర్, పెన్ పవర్

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలకు..ఆక్రమణలకు ప్రసిద్ధి గాంచిందని బాజాపా నాయకులు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలియజేశారు.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని, కార్పొరేషన్ కు వచ్చే కోట్ల ఆదాయానికి అధికారులే అడ్డంకిగా మారారని కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు ఆకుల సతీష్ పేర్కొన్నారు.. నిజాంపేట్ కార్పొరేషన్ ఏర్పడి సంవత్సరం దాటినా గ్రామపంచాయతీ అనుమతులతో నిబంధనలకు విరుద్ధంగా1000 పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, అసలు అనుమతులు లేకుండానెర ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయని, గతంలో చేసిన ఫిర్యాదు మేరకు గత కమిషనర్ ముకుందరెడ్డి ఏడు వందల పైచిలుకు అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారని వారు ఆరోపించారు.. తర్వాత వచ్చిన ప్రస్తుత ఐఏఎస్ అధికారి కమిషన్ గోపి 300 పైచిలుకు అక్రమ భవనాల రిజిస్ట్రేషన్ లో ఆపివేశారని సతీష్ తెలిపారు..  కొత్త మున్సిపల్ చట్టం అటకెక్కిందా.. దాదాపు వెయ్యి బిల్డింగ్ లకి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిపి వేసినా, ప్రస్తుతం ఉన్న కమిషనర్, గ్రామపంచాయతీ నిబంధనల సాకుతో జి ప్లస్ టు, వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..దీనివల్ల కార్పొరేషన్‌ వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, అక్రమార్కులు ఇదే అదునుగా ప్రస్తుతం 60 నుండి 70 అక్రమ నిర్మాణాలు గ్రామపంచాయతీ అనుమతితో నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు..మైనం బొమ్మాలా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. గత డిసెంబర్,జనవరి నెలలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై అక్రమ నిర్మాణాలు గుర్తించి సెక్షన్ 180 181 తెలంగాణ మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం సీజ్ చేశారని, మళ్లీ కమిషనర్ అనుమతి లేకుండానే యధావిధిగా నిర్మాణాలు జరుగుతున్నా, కేసులు ఎందుకు పెట్టడం లేదని, అలాంటప్పుడు మున్సిపల్ చట్టం ఎందుకని బాజాపా నాయకులు ప్రశ్నించారు..నిజాంపేట్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ నిర్మాణాలు జరుగుతున్న తూతూ మంత్రంగానే నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.. కార్పొరేషన్‌కు భారీ ఆదాయవనరులకు గండి కొడుతున్నా కమిషనర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు..  కంటితుడుపు చర్యలతో ఆదాయానికి గండి.. 1001 బిల్డింగ్ రిజిస్ట్రేషన్లు ఆపివేయడం మంచి పరిణామమే అయినా.. కార్పొరేషన్‌కు వచ్చే లాభం పక్కదారి పడుతు రాజకీయ నాయకులకు ఆదాయ వనరులుగా మారిందని.. తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు కోసం జిల్లా కలెక్టర్ మరియు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ కు పంపడం ద చట్టప్రకారం భవనం మొత్తం 25 శాతం అపరాధ రుసుము వల్ల వందల కోట్ల ఆదాయం మున్సిపల్ కార్పొరేషన్ దక్కకుండా పక్కదారి పడుతుందని అన్నారు.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలకై, కార్పొరేషన్ స్థాయి అధికారులతో ఎన్ ఫోర్స్ మెంట్ కమిటీలు ఎవరిని ఉద్దరించడానికి అని ప్రశ్నించారు.. కంటితుడుపు చర్యలు చేపట్టి అదనపు అక్రమ అంతస్తుల నిర్మాణాలపై చర్యలు తీసుకొని, గతంలో వలె అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా సమకూర్చడానికా.. అని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 6 భవనాలకు ఎలాంటి అనుమతులు లేవని,తప్పుడు అనుమతుల నిర్మాణాలపై ముందుగా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను డిమాండ్ చేశారు, కార్పొరేషన్‌లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూములు ,చెరువుల, పార్కులలో అక్రమ నిర్మాణాలపై అక్రమాలపై, గతంలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా తూతూమంత్రంగా చర్యలు తీసుకొని వదిలేసిన ఘనత కమిషనర్ దక్కుతుందని, అసతీష్ తెలిపారు.. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర మైనార్టీ మోర్చా మహిళ ప్రముఖ ఆమల్లేశ్వరి, జిల్లా ఎస్టీ మోర్చా ఆధ్యక్షులు రామచంద్రనాయక్, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దాస నాగరాజు, కార్పొరేషన్ పార్టీ, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్, సెక్రటరీ అరుణ్ రావు, బీజేవైఎం అధ్యక్షుడు రవీంద్ర బాబు, సీనియర్ నాయకులు కాంతారావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...