కార్మిక సమస్యల పరిష్కారానికి అవిశ్రాంత పోరాటం
కళ్యాణిఖని,పెన్ పవర్
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని, పోరాట కార్యక్రమాల్లో కార్మికులందరూ భాగస్వాములు కావాలని సింగరేణి కోల్ మైన్స్(బిఎంఎస్) అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కాసీపేట 1 గనిపై బిఎంఎస్ ఆద్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 12 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని,లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) 9 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.టీబీజీకేఎస్ హయాంలో సింగరేణి వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటీకరణ జరుగుతోందని, ప్రైవేటీకరణను అడ్డుకోకుండా టీబీజీకేఎస్ నాయకులు యాజమాన్యానికి వత్తాసు పలుకడం మూలంగానే భూగర్భ గనులలో,పర్మినెంట్ పనిస్థలాల్లో కాంట్రాక్ట్ కార్మికుల విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.అన్ని కోల్ శాంప్లింగ్ విధానంలో, సింగరేణి ఆస్పత్రులలో వార్డ్ బాయ్స్, స్టాఫ్ నర్స్, స్కావెంజర్,ఎస్ అండ్ పిసి సెక్యూరిటి విభాగంలో సెక్యూరిటీ గార్డులను ప్రైవేట్ పరం చేశారని, డిస్పెన్సరిలు,వివిధ విభాగాలను,భూగర్భ గనులను మూసివేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు సంస్థ వ్యాప్తంగా 62 వేల మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 45 వేల మంది మాత్రమే ఉన్నారని దీనికి పూర్తిగా గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలికంగా బిఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండ రమాకాంత్, డోనికేన రమేష్,జివై ప్రదీప్ కుమార్, మొటపోతువ శ్రీనివాస్,మంద రజనీకాంత్, కస్తూరి రవి కుమార్, పెండెం సత్యనారాయణ, సిరిపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment