జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
జగ్గంపేట పెన్ పవర్తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇ ఐ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ తన సిబ్బందితో బుధవారం కంటి వైద్య సేవలు అందించారు. జగ్గంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు అడపా వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ కంటి వైద్య శిబిరంలో మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు అడపా వెంకట రావు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి కంటి వైద్య కేంద్రం వైద్యులు అందించిన సేవలు మరువరాని అని ఆయన అన్నారు.
ప్రతి ఒక్క జర్నలిస్టు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సేవలను వారి కుటుంబ సభ్యులతో కలిసి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈనెల 16వ తేదీన జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు మరియు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఈ ఐ జిల్లా కంటి వైద్య కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 13 సిహెచ్సి ల లో వైద్య కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు. దీనిలో భాగంగానే జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కంటి వైద్య పరీక్ష సేవలు మీడియా వారికి అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా పేద ధనిక వర్గాల తారతమ్యం లేకుండా తాము నిర్వహించే కంటి వైద్య సేవలను మీడియా ద్వారా అందరికీ తెలపాలని ఆయన కోరారు. అత్యాధునికమైన కంటి వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కరుణ్ కుమార్ సురేష్ కుమార్ క్రాంతి కుమార్ సుబ్రహ్మణ్యం వైద్య సేవలు అందించిన వారిలో ఉన్నారు.
No comments:
Post a Comment