Followers

సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యం

 సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యం

సాలూరు,పెన్ పవర్

గర్భిణీలు మరియు బాలింతలు సమతుల్య ఆహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్యం కలుగుతుంది అని సాలూరు అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు బలగ రాధ అన్నారు. సాలూరు పట్టణంలో బుధవారం ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ప్రాజెక్టు అధ్యక్షురాలు బి. రాధ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీలు, బాలింతలును ఉద్దేశించి మాట్లాడారు. రక్తహీనత లోపాలు లేకుండా ఉండాలంటే పౌష్టికాహారం సమతుల్యత ప్రకారం తీసుకోవాలని అన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందే విధంగా విధులను నిర్వర్తించాలని అన్నారు. ఈ పోషణ పక్వాడ కార్యక్రమంలో23, 24 వార్డులు అంగన్వాడీ కార్యకర్తలు మరియ సచివాలియా సిబ్బంది శ్రావణి, యుమన, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...