అయ్యరక కౌన్సిలర్లకు సన్మానం
నర్సీపట్నం, పెన్ పవర్
ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందిన అయ్యరక కులస్థులను, స్టేట్ అయ్యరక కార్పోరేషన్ డైరక్టర్ కర్రి కనకమహాలక్ష్మీ దంపతులు ఘనంగా సన్మానించారు. నర్సీపట్నంలో 21వ వార్డు నుండి కర్రి వినీలాచైతన్య వైసిపి తరుపున గెలుపొందగా, 22వ వార్డు నుండి పెదిరెడ్ల దివ్య టిడిపి తరుపున గెలుపొందారు. అదేవిధంగా సామర్లకోట మున్సిపాలిటీలో ఆవాల లక్ష్మీనారాయణ వైసిపి తరుపున గెలుపొందిన విషయం తెలిసిందే. వీరందరినీ కనకమహాలక్ష్మి, రాంగోపాల్ దంపతులు గెలుపొందిన కౌన్సిలర్లకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కనకమహాలక్ష్మి మాట్లాడుతూ మన సామాజికవర్గం నుండి మరింత మంది ఉన్నత పదవులు అలంకరించాలని, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్లుగా గెలుపొందిన వీరందరూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
No comments:
Post a Comment