స్వేరోస్ గొల్లపల్లి మండల శాఖ ఆధ్యర్యంలో భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
గొల్లపల్లి ,పెన్ పవర్
ఈ రోజు గొల్లపల్లి మండల కేంద్రంలో ని అంబేడ్కర్ విగ్రహం దగ్గర స్వేరోస్ మండల శాఖ ఆధ్యర్యంలో భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మండల అధ్యక్షులు తాండ్ర జీవన్ మాట్లాడుతూ- మన సుప్రీం స్వేరో,గురుకుల పాఠశాలల కార్యదర్శి, డా.RS ప్రవీణ్ కుమార్ అడిషనల్ DGP గారి ఆదేశాల మేరకు- మార్చ్ 15 నుండి ఏప్రిల్ 18 వరకు మహనీయుల జయంతి ఉత్సవాలు-
మాన్యవర్ కాన్షీరాం గారి జన్మదినం మర్చి15న,
బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఏప్రిల్ 5న,
మహాత్మ జ్యోతిరావ్ పూలే గారి జయంతి ఏప్రిల్ 11న,
ఏప్రిల్ 14 న డా.బి ఆర్ అంబేడ్కర్ గారి జన్మదినం సంధర్భంగా
దాదాపుగా నెల రోజులు స్వేరోస్ మరియు దాని అనుబంద సంఘాలు భీమ్ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలుపుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కేవలం విద్యతోనే సమ సమాజ నిర్మాణానికి పునాది వేయవచ్చు అని నమ్మిన మన మహనీయుల ఆలోచనలని స్మరించుకుంటూ వారి పుట్టినరోజులను ఘనంగా నిర్వహిస్తూ,ఈ నెల రోజులు పండగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మార్చి 15 న దూలికట్ట, పెద్దపల్లి జిల్లా సందర్శన తో మొదలయ్యే ఈ భీమ్ దీక్ష కార్యక్రమం ఏప్రిల్ 18 న NG కాలేజ్ గ్రౌండ్ నల్లగొండ లో ముగుస్తుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో స్వేరోస్ గొల్లపల్లి మండల స్వేరోస్ ప్రధాన కార్యదర్శి మారంపల్లి వెంకటేష్,స్వేరోస్ సభ్యులు- చౌటపల్లి తిరుపతి,గంగాదర నరేష్, జేరిపోతుల ప్రణయ్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment