Followers

మాస్క్ ధరించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం

 *మాస్క్ ధరించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం

*రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కఠిన చర్యలు

*ఆదేశాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద శిక్షలు తప్పవు

 *ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు

*పోలీస్ కమిషనర్ శ్రీ డి. జోయల్ డేవిస్ ఐపిఎస్ 

సిద్దిపేట , పెన్ పవర్

కొవిడ్ 19  కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొద్ధి రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని, మాస్కులు ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, మరియు జరిమానాలు విధించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని సూచించారు.  జిల్లాలో కరోనా కేసులపై అప్రమత్తంగా ఉంటూ అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులుగా ఉండడం నిషేధమని చెప్పారు. అన్ని రకాల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లో, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ విధిగా భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వెంట ఉంచుకోవాలని సూచించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసి చట్టప్రకారం  చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 30 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...