మానసిక వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు....
పెన్ పవర్,తాళ్ళూరు
తాళ్ళూరు మండలం లోని తూర్పు గంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక రుగ్మతలు ఉన్న వారికి మానసిక వైద్య నిపుణులు డా. చంద్ర శేఖర్ ( సైకియాట్రీస్ట్) ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించబడతాయి అని డాక్టర్ బంక రత్నం తెలిపారు. డాక్టర్ జె. చంద్ర శేఖర్ మాట్లాడుతూ వెల్ నెస్ సెంటర్స్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక రుగ్మతలకు వైద్య సేవలు .ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల నాలుగవ సోమవారం మానసిక రుగ్మతలు, నిద్ర లేమి, మూర్ఛ రోగం, సైకోసిస్, మొదలగు రోగులకు వైద్యసేవలు అందించబడతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ అనిల్, ఆసుపత్రి సిబ్బంది అనిత, అంజిరెడ్డి, వాణి, సుశీల పాల్గొన్నారు.
No comments:
Post a Comment