Followers

ప్రభుత్వానికి మాపై మనుసు ఉన్నట్లా లేనట్లా?.

 ప్రభుత్వానికి మాపై మనుసు ఉన్నట్లా లేనట్లా?.

 మహుబూబాబాద్ జిల్లా వి ఆర్ ఓ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎస్ కే ఫరీద్ బాబా

నెల్లికుదురు, పెన్ పవర్ 

ప్రభుత్వంవి ఆర్ ఓ ల గురించి ఏమనుకుంటుందని ప్రభుత్వానికి పెద్ద కొడుకులా ప్రజలకు ఆపద్బాంధవుడిగా అర్ధరాత్రి,అపరాత్రి అనకుండా మానవసేవయే మాధవసేవ అని నమ్మి మా కుటుంబాలని సైతం లెక్కచేయకుండా ప్రజలే దేవుళ్ళుగా  ప్రభుత్వమే తండ్రిలా భావించి సుమారుప్రభుత్వంలోని అరవైనాలుగుశాఖలకు ఎప్పటికప్పుడు ఒంటిచేత్తో కావాల్సిన సమాచారం అందిస్తూ అటు ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇటు ప్రజలకు మేము  ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్న ఆఘమేఘాల మీద కావాల్సిన పనులు చేస్తూ అటు అధికారుల ఒత్తిడి ఇటు ప్రజల ఇబ్బందులను ఏకకాలంలో  దశవతారాలలో పనులు చేస్తున్న ఏకైక అధికారులు ఒక్క గ్రామ రెవిన్యూ అధికారులే అని పెన్ పవర్ విలేకరితోతమ గోడును వెలిబుచ్చాడు   ఇంతటి ఘనచరిత్ర ఉన్న విలేజ్ రేవెన్యూ అధికారులను అవినీతి పరులంటూ ప్రభుత్వంలోని పెద్దలు బహిరంగంగా నిస్సుగ్గుగా పదేపదే చెప్పటం వారి కపటబుద్దిని చెప్పకనే చెప్పుతుందని ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే గత ఏ డునెలలుగా రెవెన్యూ అధికారులను సుప్తచేతనావస్థలో ఉంచి అనధికారికంగా అధికారులతో ఒత్తిడిచేసి పనిచేయించుకొనుటకు ఈ ప్రభుత్వానికి మనసేల  ఒప్పుతుందని అసలు ఈ ప్రభుత్వానికి మాపైమనసున్నట్లా లేనట్టా అని ప్రజలకు కూడా అర్థం కాని సందిగ్ధవస్థలో ఉన్నారని కానీ ఏ  ప్రభుత్వ అధికారికైనా ప్రజలు ఐదు గంటల తరువాత ఫోన్ చేయగలరా ఆలోచించాలి అర్ధరాత్రి కూడా అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ప్రజలకు అందుబాటులో 24×7 లా పని చేసే మాపై మీ పాపాలపుట్ట కదులుతుందన్న భయంతో మా పై అవినీతి ముద్ర వేసి 7 నెలలుగా ఎటు తేల్చకుండా అధికార అహంకారంతో ఎన్నో అవమానాలకు అవహేళనలకు ఇబ్బందులకు గురిచేస్తూ ప్రభుత్వం మాది అన్న అహంభావంతో  అన్ను మీన్ను కానరాక కళ్ల కు కైపెక్కి మహోన్నత చరిత్ర ఉన్న మాపై మట్టిపోసిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర చూసిన రెవెన్యూ శాఖ  అన్నిశాఖలకు పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలను తొడగొట్టి పడగొట్టిన దమ్మున్న వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇంతటి మహోన్నత చరిత్రగలిగిన మాపై నిందవేయుట సమంజసమా అని తెలంగాణా సమాజం ప్రశ్నించే సమయం ఆసన్నమైందని అర్ధరాత్రి గ్రామ పరిధిలో గుర్తుతెలియని అనాధ శవాల పక్కన భోజనం చేసే యూనిఫామ్ లేని నిజమైన పోలీస్ ఎవరో గ్రామాల్లో తెలుసుకోవాలని  ప్రకృతి వైపరిత్యాలు వస్తే ప్రజలను మేల్కొలిపి సురక్షిత ప్రాంతాలకు తరలించే సంఘసేవకులం ఇళ్లు కాలిన ఒళ్ళు కాలిన ప్రజల కంట్లో నలుసుపడ్డ కాలికి ముళ్లిరిగిన పంటితో తీసేవాడే పట్వారీ  లేకుంటే నీవెక్కడుండేవాడివో  చరిత్ర మరిచి మమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టి అవినీతిముద్ర వేయుట తగునా అని  ప్రభుత్వానికి పెద్దకొడులా ప్రజలకు తండ్రిలా సేవచేస్తున్న మమ్మల్ని ఇంతకఠినమైన  నిందలుమోపి అనుక్షణం మానసికక్షోభకు గురిచేసి  సమాజంలో తలెత్తుకొని తిరుగులేని విధంగా అవమానపర్చిన ఇన్నాళ్లు మేము చేసిన సేవలేమాకు  శ్రీరామరక్ష.అన్నారు. ఇకనైనా మాబాధలు చూసి మమ్ములను విధులలోకి తీసుకవాలని కన్నీటి పర్యంతంమై అయన తమ గోడును వెళ్ళబోసుకున్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...