Followers

ఘన చరిత్ర కలిగిన కళాశాల టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల...సీఐ విజయ్ కుమార్

 ఘన చరిత్ర కలిగిన కళాశాల టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల...సీఐ విజయ్ కుమార్    


    

 పెన్ పవర్, కందుకూరు

 స్థానిక  తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ బి. రవి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కందుకూరు సి ఐ విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ విజయకుమార్ మాట్లాడుతూ టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో ఘన చరిత్ర కలిగిందని,  ఇక్కడ చదువుకున్న విద్యార్థులుఎంతో మంది ఉన్నత స్థాయి లో ఉన్నారని అటువంటి కళాశాలకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చొరవతో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు సమకూర్చారని అన్నారు. 

ఈ సౌకర్యాలన్నీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని  కోరారు.విద్యార్థి దశలో డిగ్రీ అనేది ఎంతో కీలకమైనదని,  సమాజంలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని ఆ స్థాయికి చేరాలని అన్నారు.పట్టణ ఎస్ఐ కేకే తిరుపతి రావు మాట్లాడుతూ ఎల్ హెచ్ ఎం ఎస్ ఏపీ పోలీస్ యాప్, దిశ యాప్ ఉపయోగాలను గురించి, సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి,  అంతర్జాలం లో జరుగుతున్న మోసాలను గురించి విద్యార్థులకు వివరించారు. కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు డాక్టర్ ఆంజనేయులు మొదటి సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు కళాశాలలో నడుచుకొనవలసిన  విధానాన్ని గూర్చి వివరించారు. కళాశాలలో జరిగే సాంస్కృతిక మరియు వ్యాయామాల్లోపాల్గొని కళాశాలకు మంచి పేరు తీసుకొని రావాలని కోరారు.డిగ్రీ రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం డిగ్రీ, పిజి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో విజయశ్రీ, మైత్రి, అధ్యాపక, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...