విజేత ఎస్ వి ఎస్ ఎస్
సంతబొమ్మాళి, పెన్ పవర్
మండల కేంద్రం సంతబొమ్మాళి లో శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఉత్సవాలు సందర్బంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఎస్ వి ఎస్ ఎస్ (మామిడి పల్లి) టీమ్ విజేత గా నిలిచి ప్రధమ బహుమతిగా 20వేలు రూపాయలు గెలుచుకుంది.హనుమాన్ గురుస్వామి పప్పు రాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఆదివారం నుంచి జరిగిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 50టీమ్ లుపాల్గొన్నాయి. ద్వితీయ స్థానం లో పాలకొండ టీమ్ నిలిచి 15వేల రూపాయలు గెలుపొందగా, తృతీయ స్థానం లోసింగుపురం, మామిడి పల్లిటీమ్ లు నిలబడి చెరో 8వేలు బహుమతి గా గెలుచుకున్నారు. విజేతలు కు సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పాల వసంత రెడ్డి, మరియు కోత సతీష్ చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ కళింగ పట్నం లక్ష్మి, వైసీపీ నాయకులు వాదాల దుర్గారావు, కొన్న శ్రీరాములు, పాల మహేష్, సోమేసు, డాక్టర్ అప్పారావు, అట్టాడ వెంకటరమణ, దూబ వేణు, పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment